కలం, జోగులాంబ గద్వాల: గట్టు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (Gattu SI) గా కళ్యాణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ బదిలీ కావడంతో ఆయన స్థానంలో గద్వాల టౌన్ ఎస్ఐగా శేఖర్ గౌడ్ పని చేస్తున్న కళ్యాణ్ కుమార్ గట్టు పోలీసుస్టేషన్కు బదిలీ అయ్యారు.

