అర్హులైన ఓటర్లకు కలెక్టర్ కీలక సూచన

కలం, ఖమ్మం బ్యూరో : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు (Special Voter Registration) శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉంటారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులు కూడా ఈ శిబిరాల్లో ఫారం-6 సమర్పించి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ సమీప పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>