కలం, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగులకు (Railway Employees) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న దీపావళి సందర్భంగా బోనస్ (Diwali Bonus) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వనున్నారు. మొత్తం రూ.2009.61 కోట్లు బోనస్ రూపంలో ఉద్యోగులకు దక్కనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ బోనస్‌ను ఆమోదించారు.
బోనస్‌గా రూ.2009.61 కోట్ల మొత్తాన్ని కేటాయించగా ఇందులో గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి రూ.17,951 అందనుంది. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు వంటి గ్రూప్ సీ సిబ్బందికి ఈ బోనస్ వర్తిస్తుంది. రైల్వే శాఖలో ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా, భవిష్యత్తులో మరింత మెరుగైన పనితీరును కనబరిచేందుకు వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 49,600 మందికి పైగా ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు.
Also Read : రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!
Follow Us On : WhatsApp

