కలం, వెబ్ డెస్క్: బౌరంపేట్ భూ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ (Balmoor Venkat) వెంకట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా సాగుతోందని ఆయన పేర్కొన్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేటీఆర్ (KTR) ఆరోగ్యం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు సంబంధించిన అంశాలను బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) ప్రస్తావించారు. ‘‘కేటీఆర్కు జ్వరం లేదు.. ఏం లేదు.. విదేశాలకు వెళ్లినప్పుడల్లా డ్రగ్స్ తీసుకోవడం వల్లే జుట్టు పోతోంది‘‘ అని సెటైర్లు వేశారు. అందుకే ఆయన ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి.. ఎమోషనల్గా దెబ్బతీయాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : ఇంద్రవెల్లిలో కవిత భారీ సభ.. ఎప్పుడంటే?
Follow Us On: Youtube

