రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!

కలం, సినిమా : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు, కొచ్చి, చెన్నై, విజయవాడ, కొడగు ప్రాంతాల్లోని 400 కుటుంబాలను ఆమె దత్తత తీసుకున్నారు. ఈ కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా కిరాణా సరుకులను అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రష్మిక.. తాను నటించిన ‘రణబాలి’ సినిమాలోని జయమ్మ పాత్రకు, తన వ్యక్తిత్వానికి కొన్ని పోలికలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వ్యక్తిగతంగానే ఉంచానని, అయితే తనను అభిమానించే వారు కూడా ఇలాంటి మంచి పనులకు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కోసారి చిన్న సాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదని రష్మిక అభిప్రాయపడ్డారు. అందుకే 400 కుటుంబాలకు ఒకేసారి మూడు నెలల పాటు నిత్యావసర సరుకులు అందిస్తూ, వచ్చే ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా వారు కిరాణా ఖర్చుల్లో ఆదా చేసుకున్న డబ్బును తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోగలరని ఆమె (Rashmika Mandanna) తెలిపారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, గాయాలు, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు.. ఇలా ఎన్నో అనుభవాల తర్వాత ఈ కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో విలువైన అనుభూతినిస్తోందని రష్మిక పేర్కొన్నారు.

Also Read : బీపీ తగ్గాలంటే ఏ జ్యూస్ తాగాలి? దానిమ్మా.. బీట్‌రూటా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>