కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ను కలిసిన పల్లె గంగారెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె జంగారెడ్డి (Palle Gangareddy) కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాల గురించి వివరించారు. అలాగే పసుపు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. రైతుల సమస్యలకు తగిన పరిష్కారాలు చూపించి, పసుపు రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. గంగారెడ్డితో కిసాన్ సంఘ్ అధ్యక్షులు సాయిరెడ్డి, అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు.

Also Read :  రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>