కలం, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన సుంచు సరస్వతి అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF Cheque) నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

