కలం వెబ్ డెస్క్ : వెనుజువెలా(Venezuela) ప్రజల కోసం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) కీలక ప్రకటన చేశారు. స్పేస్ ఎక్స్ యాజమాన్యంలోని స్టార్ లింక్ (Starlink) సంస్థ ద్వారా ఫిబ్రవరి 3 నుంచి వెనిజులా ప్రజలకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఎక్స్ వేదికగా మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో (Nicolas Maduro)ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. మదురో అరెస్ట్ అనంతరం వెనెజువెలాలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయాలను గత కొంతకాలంగా వ్యతిరేకిస్తూ ఉన్న ఎలన్ మస్క్ ఇప్పుడు వెనెజువెలాపై సైనిక చర్యను పరోక్షంగా ఖండించారు. వెనెజువెలా దేశానికి, ప్రజలకు నైతికంగా మద్దతు ప్రకటించడం గమనార్హం. ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య అనంతరం మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బహిరంగ ప్రకటన చేయడం విశేషం.

Read Also: భోగాపురం ఎయిర్‌పోర్టులో నేడు కీలక ఘట్టం
Follow Us On: Instagram


