సోమవారం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా (Collector Bhavesh Mishra) తెలిపారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న సందేహాలకు కలెక్టర్‌ స్పష్టతనిచ్చారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>