కలం, కుభీర్ : కుభీర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) సూచించారు. శ్రీ విఠలేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి నిమజ్జన వేడుకలను తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం, క్రమశిక్షణ పాటిస్తూ పోలీసు, అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

