దానంపై అనర్హత వేటు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) రియాక్ట్ అయ్యారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదన్నారు. కేవలం దానం నాగేందర్ మాత్రమే కాకుండా.. మిగతా వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని తేల్చి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఖాయమని, ఖైరతాబాద్ బై‌పోల్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీ పేరుతో తనను విమర్శించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏనాడైతే దానం నాగేందర్ పార్టీ మారారో, ఆరోజు నేను అనర్హత గురించి చెప్పానని కౌశిక్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన నేతలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>