మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల సంబరాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రెండేళ్ల పొలిటికల్ జీవితం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్‌యూఐ నాయకునిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగారంటే ఆయన కృషికి నిదర్శనం అని పేర్కొన్నారు.

మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉంటూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని నగేష్ రెడ్డి కొనియాడారు. పార్టీలో జరిగే ప్రతి సమస్యను ముందుండి అందరిని సమన్వయ పరుస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా మహేశ్ కుమార్ కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో గ్రామ పంచాయతీలలో 70% కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మహేష్ కుమార్ గౌడ్ నిబద్ధతకు నిదర్శనమని  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చారని అన్నారు. విద్యార్థి స్థాయి నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగారంటే అందరికి ఆయన నిదర్శనం అని అన్నారు. పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్నారని కొనియాడారు.

రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంతకు ముందు బీసీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నారని.. మరోసారి మూడో ముఖ్యమంత్రి బీసీ నుండి అయితే ఆది మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పుకొచ్చారు. ఆయన నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేస్తే ఆయనను గెలిపించేవిధంగా అందరూ పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హాందాన్, మేయర్ ఉమారాణి, రమేష్ రెడ్డి, రామ్ భూపాల్, కవిత రెడ్డి, రామకృష్ణ, కాపుకర్ గణరాజ్, రత్నాకర్, చాట్ల నరేష్, విపుల్ గౌడ్, యాదగిరి, సంతోష్, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, అంతరెడ్డి రాజారెడ్డి, బొంబోతుల ప్రవీణ్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, కరీముద్దీన్, ఎర్రం గంగాధర్, మనోహర్, మీసాల సుధాకర్, రేవతి, మలైకా బేగం, స్వప్న, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>