కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ కమిటీలో కీలక నియామకం

కలం, కరీంనగర్: కరీంనగర్(Karimnagar) కార్పొరేషన్  కాంగ్రెస్ కమిటీ(Congress Committee) జనరల్ సెక్రటరీ, మీడియా ఇంచార్జ్‌గా బ్యాంక్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు వి. దేవేందర్ పటేల్ (Devender Patel) నియమితులయ్యారు. ఈ మేరకు కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దేవేందర్ పటేల్ నిరంతరం కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్‌కు దేవేందర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>