ముషీరాబాద్‌లో బాహుబలి గణపతి.. ‘వెయ్యి రోజుల ప్రజాపాలన’ థీమ్!

కలం, వెబ్ డెస్క్ : వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో(Musheerabad) ఏర్పాటు చేసిన వినూత్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ‘వెయ్యి రోజుల ప్రజాపాలన’ అనే థీమ్‌తో  గణపతిని ఏర్పాటు చేశారు. బాహుబలి తరహాలో భారీ రూపంలో రూపొందించిన ఈ గణపతి విగ్రహం ఎంతగానో  ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణపతిని ఎత్తుకున్నట్లుగా విగ్రహం  రూపొందించడం ప్రత్యేకతగా నిలిచింది.

గణపతి విగ్రహంతో పాటు మండపాన్ని కూడా ప్రభుత్వ పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. వినూత్న ఆలోచనతో రూపొందించిన ఈ మండపాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ‘వెయ్యి రోజుల ప్రజాపాలన’లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా మండపంలో వివిధ అంశాలను ప్రదర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. వినూత్న థీమ్‌తో రూపొందించిన బాహుబలి గణపతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>