దగ్గరుండి పెళ్లి చేశాడని.. దారుణ హత్య!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లాలాగూడ (Lalaguda) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ (40) అనే యువకుడు నాలుగేళ్ల కిందట ప్రేమ పెళ్లికి సహకరించి, దగ్గరుండి యువతికి పెళ్లి చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ క్రమంలో యువతి సోదరులు కార్తీక్‌పై పగ పెంచుకుని.. ఎప్పటికైనా చంపేస్తామని హెచ్చరించారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

వినాయక మండపం వద్దనే..

వినాయక చవితి పురస్కరించుకుని లాలాగూడ బస్తీలో గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నకార్తీక్‌తో యువతి సోదరులు, వెంట వచ్చిన పది మంది వ్యక్తులు గొడవకు దిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత కూడా మరోసారి పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గం కార్తీక్ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో కొట్టామిట్టాడుతుండగా.. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>