అధికారులకు ఎమ్మెల్యే కూనంనేని ఆదేశాలు!

​కలం, ఖమ్మం బ్యూరో : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల వేళ భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పటిష్ట ముందస్తు ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు ఆదివారం పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ప్రజలందరూ భక్తిశ్రద్ధలు, ఐక్యత, సుఖసంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, బస్తీలు, ప్రధాన కూడళ్లలోని మండపాల వద్ద మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు నిరంతరం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు రాత్రి వేళల్లో ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>