కలం, నిర్మల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలకు ఎస్పీ(Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో సోదరభావంతో నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా యువత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు. ప్రజలందరూ పరస్పర సహకారంతో భక్తి, సోదరభావంతో వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

