15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు మేయర్ శ్రీకారం

కలం, కరీంనగర్: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా కరీంనగర్ నగర పాలక సంస్థ (Karimnagar Municipal Corporation) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం 30 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న HDPE పైప్‌లైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశం

ఈ సందర్భంగా మేయర్ (Mayor Kolagani Srinivas) మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగుపడేలా HDPE పైప్‌లైన్ నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, నగర పాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>