అసెంబ్లీకి వెళ్లకుండా సీఎం కుట్ర: సబితా ఇంద్రారెడ్డి

కలం, వెబ్ డెస్క్: తాము అసెంబ్లీకి వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆరోపించారు. శాంతి భద్రతలపై నిలదీస్తామనే అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు అధ్వానంగా మారిందని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. రౌడీ షీటర్లకు అడ్డాగా రాష్ట్రం మారిపోయిందన్నారు. మహిళలు బయట తిరగని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురి కావడం షాకింగ్ విషయమన్నారు.

ఒకప్పుడు నెంబర్ వన్, ఇప్పుడు..

ఒకప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉండేదని.. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వాపోయారు. దేశంలో నేరాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చెబుతున్నాయని వివరించారు. హోం శాఖను కూడా సీఎం రేవంత్ రెడ్డినే చూస్తున్నారని.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిద్రపోతున్నారా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంపై నిరంతర నిఘా పెట్టడానికి వాడుకోవాల్సిన కమాండ్ కంట్రోల్ సెంటర్.. రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : మోదీ 25 ఏళ్ళ ప్రస్థానం.. ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి: గోపి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>