కలం, నిర్మల్: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులను పోలీసులు శనివారం ముందస్తుగా అరెస్టు చేశారు. అంతేకాక వారు ఆందోళనకు వెళ్లకుండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ఆందోళనకు పిలుపునిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం అన్యాయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై నాయకులను విడుదల చేశారు.
Also Read : గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

