నేటితో అసెంబ్లీ సమావేశాల ముగింపు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ మొదలు కానుంది. 22 ఏ నిషేధిత భూముల అంశంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వల్పకాలిక చర్చను ప్రారంభించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చలో పాల్గొని వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా నిషేధిత భూముల అంశం రాజకీయ రగడకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరి రోజు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలకు సంబంధించి సవరణలను సభ ఆమోదించింది.

బీఆర్ఎస్ దూరం..

వర్షాకాల అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పాల్గొనకుండానే ముగియబోతున్నాయి. తొలి రోజు అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకున్న పరిణామాలతో గందరగోళం నెలకొంది. కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదుతో పాటు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. బీజేపీ సభ్యులు మాత్రమే సభకు హాజరై పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also Read : బ్రిక్స్ అతిథులకు ఇండియన్ టేస్ట్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>