రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌కు వినతి

కలం, జోగులాంబ గద్వాల: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గద్వాల్ (Gadwal) జిల్లా రైస్ మిల్లర్ల సంఘం (Rice Millers Association) ఆధ్వర్యంలో గురువారం జిల్లా‌ అదనపు కలెక్టర్ మధు మోహన్‌కు (Madhu Mohan) వినతిపత్రం సమర్పించారు. రైస్ మిల్లర్ల (Rice Millers) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష,‌ కార్యదర్శులు,‌ సభ్యులు,‌ యాజమాన్యం మాట్లాడుతూ.. రైస్ మిల్లర్స్ పై పెనాల్టీలు, అధిక వడ్డీ భారంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటూ మండిపడ్డారు. రైస్ మిల్లర్స్ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని అన్నారు‌.

అక్టోబర్ 30 వరకు గడువు ఇవ్వాలని డిమాండ్

జిల్లా రైస్ మిల్లర్స్ అక్టోబర్ 30 వరకు మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసి బియ్యం డెలివరీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి అని షార్ట్‌ఫాల్‌ పేరుతో పెనాల్టీలు విధిస్తే రాష్ట్రంలో మూతపడే ప్రమాదం ఉందని అన్నారు. రైస్ మిల్లులపై ప్రభుత్వం చేపడుతున్న ఫిజికల్ వెరిఫికేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.‌ ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>