స్పీకర్‌ను వెంటనే సీఎం చేయాలి.. తలసాని డిమాండ్

కలం, వెబ్ డెస్క్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. దళిత స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ చూడలేదని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ లో ఆయన మాట్లాడారు. గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడని ఈ రాష్ట్ర ప్రజలకు సగం మందికి తెలియదని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే దళితుడు అనడం వల్లనే గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడని తెలిసిందని అన్నారు. అసెంబ్లీ బయట స్పీకర్ పరిధి కానే కాదని.. తమ పార్టీ ఎమ్మెల్సీ  తాతా మధు అనని మాటలను అన్నట్టుగా చేశారని దుయ్యబట్టారు.

దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ ను (Gaddam Prasad Kumar) వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తలసాని (Talasani Srinivas Yadav) తెలిపారు. దళితులపై ప్రేమ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. స్పీకర్ ను ముఖ్యమంత్రిని చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.  ‘సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేటు బయట అంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముంది? తోపులాటలో బీఆర్ఎస్ శాసనసభ్యులకు దెబ్బలు తగిలాయి. మహిళ ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గొంతు, చీర పట్టుకొని లాగారు’ అంటూ మండిపడ్డారు.

Also Read : ట్రెండ్​ ను ఫాలో అవుతున్న లీడర్లు: వింటేజ్ లుక్‌లో నేతలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>