సీఎం రేవంత్‌‌పై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఫేక్ అకౌంట్ చూపించి, అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అందించారు. దీనిపై వెంటనే సభా నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి నోటీస్ అందించారు.

ఎక్స్ అకౌంట్‌పై పొలిటికల్ వార్..

‘సంధ్యారావు బీఆర్ఎస్(Sandhya Rao BRS)’ అనే ఎక్స్ అకౌంట్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరకరంగా పోస్ట్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సైతం ఈ అకౌంట్‌ పోస్టర్‌ను అందరికీ చూపించారు. అయితే, దీన్ని బీఆర్ఎస్ ఖండించింది. తమ పార్టీ పేరుతో హస్తం పార్టీ ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తోందన్నారు. సీఎం పేర్కొన్న గంటలోనే అకౌంట్ ఎందుకు బ్లాక్ అయిందని ప్రశ్నిస్తున్నారు.

Also Read : ట్రెండ్​ ను ఫాలో అవుతున్న లీడర్లు: వింటేజ్ లుక్‌లో నేతలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>