కుప్పకూలిన విమానం.. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి!

కలం, వెబ్​ డెస్క్ : అమెరికాలోని (US Plane Crash ) కాలిఫోర్నియా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శాన్ డియేగోలోని ‘మాంట్ గోమెరీ – గిబ్స్ ఎగ్జిక్యూటివ్’ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు సీట్ల సామర్థ్యం ఉన్న ‘సెస్నా 172 స్కైహాక్’ విమానం రన్‌వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెస్నా విమానం విమానాశ్రయంలోని రన్‌వే నేలను తాకిన మరుక్షణమే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే అగ్నికీలలు విమానాన్ని పూర్తిగా చుట్టుముట్టడంతో లోపల ఉన్న ఇద్దరు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. సాంకేతిక లోపమా? ల్యాండింగ్ సమయంలో గాలి తీవ్రత వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇదిలాఉంటే మాంట్ గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో గతంలోనూ పలు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2025 మేలో ఇదే విమానాశ్రయానికి సమీపంలో జరిగిన సెస్నా జెట్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>