కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan Padayatra) తన పాదయాత్ర ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. 2027 సెప్టెంబర్ , లేదంటే అక్టోబర్ నెలలో పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ తాజా ప్రకటనతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పాదయాత్ర వైసీపీ సక్సెస్ ఫార్మాలా కావడంతో మళ్లీ జగన్ సీఎం కావడం పక్కా అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ (YS Jagan) 2017 నవంబర్ 26 నుంచి 2026 జనవరి 9 వరకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర (Padayatra) నిర్వహించిన సంగతి తెలిసిందే. 3,648 కిలోమీటర్లకు పైగా జగన్ పాదయాత్ర కొనసాగించింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో కొనసాగిన ఈ పాదయాత్రకు విశేష ఆదరణ దక్కింది. దీంతో 2019 ఎన్నికల్లో విజయం సాధించి జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఈ నేపథ్యంలో జగన్ 2.0 పేరుతో ఆయన మరో పాదయాత్రతో జనంలోకి వెళబోతుండడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
Also Read : గణనాథుడి ఉత్సవాలకు బిగ్ గిఫ్ట్.. నారా లోకేష్ కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

