కలం, ఆదిలాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి (Sudharsan Reddy) మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్(Adilabad) జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి ఎన్నికల సన్నాహకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల భద్రత, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

