బొంకూరులో ప్రభుత్వ భూమి వివాదం.. గ్రామస్తుల ఫిర్యాదు

కలం, అల్లంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని బొంకూరు (Bonkur) గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గతంలో ప్రభుత్వం గ్రామంలో లబ్ధిదారులకు ప్లాట్లను పంపిణీ చేసింది. ప్లాటు పొందిన ఓ వ్యక్తి తనకు కేటాయించిన ప్లాటును మరొకరికి విక్రయించిన అనంతరం, మిగిలిన ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించుకున్నాడని వారు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని కోరారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి, అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫోటో రైటప్:
08KLM01: కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న ప్రభుత్వ స్థలం.
08KLM02: పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>