ఘనంగా ముగిసిన ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోనీ పద్మనాయక కళ్యాణ మండపంలో అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఏఐటీయూసీ (AITUC) 4వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ఘనంగా ముగిశాయి. దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను, కేంద్రం తీసుకువచ్చిన నూతన లేబర్‌ కోడ్‌ లపై చర్చించారు. 33 జిల్లాల నుంచి 650 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు హాజరయ్యారు. అందులో మహిళలు 92 మంది మహిళా ప్రతినిధులు హాజరవ్వడం గమనార్హం.

33 జిల్లాల నుండి విచ్చేసిన ప్రతినిధులు రెండు రోజుల పాటు మహాసభలో పాల్గొని అనేక అంశాలపై ఆయా జిల్లాల్లో కార్మిక ఉద్యమ నిర్మాణంపై మాట్లాడారు. మూడు సంవత్సరాల కాలంలో ఏఐటీయూసీ,దాని అనుబంధ కార్మిక సంఘాలు నిర్వహించిన పోరాటాలు,సాధించిన విజయాలపై, కార్యక్రమాలపై, నిర్మాణంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్ రాజ్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఆ నివేదికపై మహాసభకు హాజరైన ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక వర్గం ఎదుర్కరొంటున్న ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్‌ లో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాలని బాల్ రాజ్ పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను చట్టాలను నిర్వీర్యం చేయడానికి తీవ్రమైన కుట్ర చేస్తుందని అన్నారు.  భవిష్యత్తులో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించిన తర్వాత ప్రభుత్వ,ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారితో పాటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ దుర్భర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని విమర్శించారు.

కార్మికులకు రానున్న రోజుల్లో గడ్డుకాలం వచ్చే పరిస్థితి ఉందని, కార్మికులంతా ఏకమై పాలక ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని యూసఫ్ అన్నారు. మహాసభల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వ్యవహారాలను చీఫ్ ప్యాట్రన్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ప్యాట్రన్ కలవేన శంకర్, అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రతినిధుల మహాసభకు అధ్యక్ష వర్గంగా టేకుమల్ల సమ్మయ్య, ప్రేమ్ పావని, వాసిరెడ్డి సీతారామయ్య, యూసుఫ్ వ్యవహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>