రోజూలాగే నీళ్లు పట్టేందుకు వెళ్లింది.. కాసేపటికే ఊహించని విషాదం!

కలం, మక్తల్: విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడి ఆంజనేయులు, శాంతమ్మ దంపతులకు మొత్తం ఐదు మంది కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు అక్షర(13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుంది.

అయితే రోజువారి మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా నల్లా నీటిని పట్టేందుకు అక్షర కరెంటు మోటార్‌ను ఆన్ చేసి ఇంట్లో నీళ్లను నింపింది. నీటిని నింపిన అనంతరం కరెంటు మోటార్ వద్ద ప్లగ్ తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు అక్షరను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మక్తల్ ఎస్సై రాజు తెలిపారు. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అక్షర ఆకస్మికంగా ఇలా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్షర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మంగళవారం పాఠశాలకు సెలవును ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>