బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం.. టీ షర్టులు విప్పేసి!

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హరీశ్ రావు (Harish Rao) సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లటి టీ షర్టులు ధరించి సభ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. టీ షర్టులు వేసుకుని లోపలికి వెళ్లొద్దని పోలీసులు చెప్పడంతో హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు టీ షర్టులు తొలగించారు.

ఇప్పుడు తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేసినా.. పోలీసులు నిరాకరిండంతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు.. పోలీసులకు ఉండదన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కేటీఆర్ బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : చీర లాగేశారని మహిళా ఎమ్మెల్యే కన్నీరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>