‘సర్’ ప్రక్రియలో పొరపాట్లు చేయొద్దు: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాలలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)’ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న వివిధ విభాగాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

క్షేత్ర స్థాయి నుంచి వచ్చే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదే సమయంలో తరచూ వచ్చే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మావల జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రైమరీ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>