మోక్షజ్ఞ బర్త్‌డే స్పెషల్.. NBK 111 బిగ్ అప్‌డేట్

కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్‌లో మరో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం “NBK 111” వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రేపు(సెప్టెంబర్ 6) బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా NBK 111 మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి మరింత బలం చేకూర్చేలా సినిమా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “Tomorrow Evening” అంటూ పోస్ట్ చేయడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సినిమాలో బాలయ్య సరసన క్యూట్ బ్యూటీ కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి బాలయ్య కోసం మాస్ బీట్స్ సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌కి బిగ్ ఫీస్ట్ అందించింది.

Also Read : ఒంటరితనంతో ఆరోగ్యానికి ప్రమాదకరం.. WHO ఏం చెబుతుందంటే!

Follow Us on : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>