అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి లీకులు.. మూవీ మేకర్స్‌కి టెన్షన్!

కలం, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ (Raaka) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు కీలక షెడ్యూల్ సెట్స్‌పై ఉండగానే.. మరోవైపు లీకులు బెడదపై చిత్ర యూనిట్‌, మేకర్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. సినిమా కథాంశం, కీలక సన్నివేశాల గురించి సమాచారం బయటకు వస్తుండటంతో వర్రీ అవుతున్నారు.

చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun) ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నారని, దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ లుక్‌లో ప్రేక్షకులను అలరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక రష్మిక మందన్న ఇంటర్వెల్ సీన్‌కి సంబంధించిన ఎంట్రీ వివరాలు కూడా లీక్ కావడం సినిమాపై ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను దెబ్బతీసేలా ఉంది.

చిత్రీకరణ సమయంలో ఎలాంటి లీకులు బయటకు రాకుండా దర్శకుడు, నిర్మాణ సంస్థ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, నో-ఫోన్ పాలసీలను అమలు చేసినప్పటికీ లీకులు కలకలం రేపుతున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం(Raaka)పై లీకుల బెడద ఇలాగే కొనసాగితే థియేటర్లలో చూడాల్సిన మ్యాజిక్ తగ్గిపోతుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఒంటి కాలితో బ‌డికి.. యూపీ చిన్నారి వీడియో వైర‌ల్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>