కలం, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న టీఎంసీ ఆఫీస్ (TMC Office) పై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) గురువారం ఈ దాడులకు సంబంధించి సంచలన వీడియో బయటపెట్టారు. ఇందులో పలువురు వ్యక్తులు ఆఫీస్ను ధ్వంసం చేసి, లోపల ఉన్న వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని అభిషేక్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. దీనిపై గవర్నర్, కేంద్ర హోం మంత్రి, ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. హింస, బెదిరింపులతో ప్రతిపక్షాన్ని అణచివేయాలని అనుకోవడం ప్రజాస్వామ్యం కాదని విమర్శించారు.
బెంగాల్ సీఎం సువేందు అధికారి(Suvendu Adhikari)పై అభిషేక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సువేందు ఎందుకు తమను చూసి భయపడుతున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలపై, కార్యాలయాలపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగాన్ని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. తమ ఆఫీసులో ఫోన్లు లాక్కున్నారని, ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) డిమాండ్ చేశారు.
Also Read : ఒంటరితనంతో ఆరోగ్యానికి ప్రమాదకరం.. WHO ఏం చెబుతుందంటే!
Follow Us On: X(Twitter)

