మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

కలం, ఖమ్మం బ్యూరో: తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని తల్లాడ (Thallada) ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో హెల్మెట్, సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాల నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు, వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు.

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించడంతోపాటు, నంబర్ ప్లేట్లు అమర్చుకున్న వాహనదారులకు వెసులుబాటు కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, అన్ని పత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>