సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలోని మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ప్రారంభోత్స‌వంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ ప్రారంభం అనంత‌రం సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ (Telangana Folk Songs) సంద‌డి చేశాయి. వేదిక‌పై సింగ‌ర్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ ఏష నాగుల గ‌డ్డ మీద పాట పాడి కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.

అలాగే మ‌రికొన్ని తెలంగాణ జాన‌ప‌ద గేయాలు ప్లే చేయ‌గా ప్ర‌జ‌లు చేతిలో ట‌వ‌ల్స్ తిప్పుతూ డ్యాన్స్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్వ‌హించిన సాంప్ర‌దాయ నృత్యాల్లో కూడా లంబాడా మ‌హిళ‌లు తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>