కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తున్నా కొందరు వ్యాపారులు కల్తీ ఫుడ్ విక్రయాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ (Boduppal) లో గల ‘అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్’ (Amnams Gulf Bakers) పై ఉప్పలు జోన్ ఎస్ఓటీ (SOT) పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో బేకరీ నిర్వాహకులు హానికరమైన అమోనియా, కాలం చెల్లిన కృత్రిమ రంగులు, ప్రమాదకరమైన పొడులను ఉపయోగించి కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన కల్తీ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బేకరీ నిర్వాహకుడు అబ్దుల్ ముత్తలిబ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

