కలం, వెబ్డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లోని స్టార్ హోటళ్లలో కస్టమర్లకు కల్తీ ఫుడ్ (Food Adulteration) సర్వ్ చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారులు తాజాగా నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల పలు హోటళ్లపై ఫిర్యాదులు రాగా నగరవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో మొత్తం 35 ఫుడ్ షాంపిల్స్ సేకరించి బ్యాబ్కు పంపించారు.
ఈ తనిఖీల్లో అనేక ఆహార భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను పాటించకపోవడం, తప్పుడు లేబిలింగ్, డేట్ అయిపోయిన ఆహార పదార్థాల నిల్వ, అపరిశుభ్ర వాతావరణం, కూరగాయలపై బూజు పట్టడం, నాన్ వెజ్, వెజ్ లను వేర్వేరుగా నిల్వ చేయకపోవడం వంటి వాటిని అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

