కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ (Actor Srikanth) గురువారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని (Sri Lakshmi Narasimha Swamy) దర్శించుకున్నారు. బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య శ్రీకాంత్‌కు స్వామివారి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటం, లడ్డూ తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, మూర్తి అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

