సిద్దిపేట రోడ్లు గుంతలమయం.. బీఅర్ఎస్ నేతలు వినూత్న నిరసన

క‌లం మెద‌క్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో భారీమాం చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా గుంతల మాయమై నీరు నిలిచిపోయింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు నీటి గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. సిద్దిపేట ఎల్లమ్మ గుడి నుండి భారీమామ్ చౌరస్తా వరకు రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారిపోయిందన్నారు.

బీఅర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం కోసం 50 కోట్ల మంజూరు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేద‌ని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించకపోతే.. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజనర్సు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>