భారీ వర్షాలు.. కామారెడ్డి చెరువుకు జలకళ

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో కామారెడ్డి పెద్ద చెరువు (Kamareddy Lake) పూర్తిగా నిండిపోయి ఉప్పొంగుతుంది. చెరువులో ఉండే గంగమ్మ గుడి చుట్టూ వరద నీరు చేరింది. జలకళ సంతరించుకున్న పెద్ద చెరువు అలుగు దూకుతోంది. దిగువకు పరవళ్లు తొక్కుతుంది. వాస్తవానికి గత కొన్ని రోజుల వరకూ పెద్దగా వరద లేక ఈ చెరువు కూడా బోసిపోయింది. ఇప్పుడు రెండు మూడ్రోజులుగా ఎగువన తాడ్వాయి లింగంపేట ఎల్లారెడ్డి వైపు కురుస్తున్న వర్షాలతో వాగులు చెరువుల వరద కామారెడ్డి పెద్ద చెరువులోకి వచ్చి చేరుతోంది. దీంతో నిండుకుండలా మారింది.

గతేడాది ఇదే చెరువుకు భారీ వరదలు వచ్చి దిగువన ఉన్న జీఆర్‌ కాలనీతో పాటు పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఈసారి కూడా వరదల భయం జనాలను వెంటాడుతోంది. అయితే కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి ఆధ్వర్యంలో ఈసారి పలు ముందస్తు చర్యలు తీసుకున్నారు.. కాలువల్లో చెట్లు పూడిక తీయించి వరద దిగువకు వెళ్లేలా వెడల్పు చేయించారు. మరోవైపు జిల్లాలో వర్షాల నేపథ్యంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>