క్షుద్రపూజలు చేశారు.. హరీశ్ రావుపై అద్దంకి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ అరాచకం పతాక స్థాయికి చేరిందని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కోసం కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో క్షుద్రపూజలు కూడా చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.

దీని కోసం క్షుద్రపూజల కోసం ప్రసిద్ధి చెందిన శివమొగ్గ, తిరుచ్చిలో పూజలు చేశారన్నారు. తెలంగాణలో వర్షాలు కురవకుండా క్షుద్రపూజలు చేయించిన విషయం తమకు తెలుసని చెప్పారు. దీనిపై హరీశ్ రావు (Harish Rao) సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. అధికారం లేకపోతే బీఆర్ఎస్ నేతలు అఘోరాలుగా తయారవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు నష్టం జరగాలని కోరుకోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ ఆరోపణలు చేస్తున్నామని అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar) స్పష్టం చేశారు.

Also Read : మీ సేవా ఆప‌రేట‌ర్‌తో ఎంఐఎం ఎమ్మెల్యే దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>