కలం, వెబ్ డెస్క్ : విమానాశ్రయంలో సమోసాల ధరల నుంచి గిగ్ వర్కర్ల సమస్యలపై గళమెత్తిన ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) అప్పట్లో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ, దాని తరువాత జరిగిన ఆందోళనలపై ఆయన మౌనం వహించారు. దీంతో రాఘవ్ చద్దా తీరుపై నెటిజన్లు, సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించారు.
గురువారం పార్లమెంట్ లో సమాధానం ఇస్తూ.. ఇప్పుడు తాను అధికార పక్షంలో ఉన్నందున, ఈ సమస్యకు పరిష్కారం వెతకడం తన బాధ్యత అని చెప్పారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రశ్నే నా ఆయుధం.. కానీ, ఈ రోజు అధికార పక్షంలో ఉండడం వల్ల దీనిపై మాట్లాడలేకపోయాను’ అని చెప్పుకొచ్చారు. ఏదో ఒకటి చెప్పడానికి ప్రతిరోజూ కెమెరా ముందు కనిపించగలనని, కానీ తనకు పతాక శీర్షకల్లో నిలవడం కంటే ఫలితం కావాలని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో సమస్యలను, ప్రశ్నలను లేవనెత్తడమే తన పని అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ పనిని పూర్తి నిజాయితీతో చేశానన్నారు. కానీ, ప్రస్తుతం కెమెరాల ముందు మాట్లాడడం కంటే వ్యవస్థను సరిదిద్దడమే తన లక్ష్యం అని రాఘవ్ (Raghav Chadha) పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వారి డిమాండ్లు నెరవేర్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీనిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also: ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం
Follow Us On: X(Twitter)

