నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్!

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈరోజు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫార్ములా-ఈ రేస్ నిధుల బదిలీ, ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాల కేసు విచారణకు సంబంధించి ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానం జారీ చేసిన సమన్ల మేరకు ఆయన కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు మొదటి రోజు అధికారిక విచారణ ప్రక్రియలో భాగంగా నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న న్యాయస్థానం ఆదేశాల మేరకు మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చారు.

నాంపల్లి కోర్టులో విచారణ ముగిసిన అనంతరం, కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు పయనమవనున్నారు. నిన్న రాత్రి కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ఉదయం 11:30 గంటల ప్రాంతంలో నర్సంపేటకు బయలుదేరనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>