స్థంభంపెల్లి, బుగ్గారం చెరువులకు పొంచి ఉన్న ముప్పు

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial Rains) జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెరువులు నిండిపోయాయి. కొన్ని చోట్ల ప్రమాదం పొంచి ఉండగా అధికారులు అప్రమత్తమై తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బుగ్గారం మండల కేంద్రంలోని ఊరగుంట చెరువు భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో నిండిపోయింది. చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో, కట్ట తెగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చెరువుకు సురక్షితంగా గండి కొట్టారు.

నీటిని క్రమబద్ధీకరిస్తూ కిందకు విడుదల చేశారు.ఈ అత్యవసర కార్యక్రమంలో బుగ్గారం తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో సుమంత్, ఎస్ఐ సతీష్, ఇరిగేషన్ ఏఈ ప్రదీప్,పంచాయతీ కార్యదర్శి అక్బర్ పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్, వార్డు సభ్యులు బెజ్జారాపు రాజు, పొన్నం రాహుల్, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ముందస్తు చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అలాగే వెల్గటూరు మండలంలోని స్థంభంపల్లి పెద్ద చెరువు ఎడతేరిపి లేని వర్షాలతో పూర్తి స్థాయిలో నిండిపోయి కట్టపై ఒత్తిడి పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే వెంకటాపూర్, కుమ్మరిపల్లి, వెల్గటూరు, కోటిలింగాల పరిసర గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయమై అప్రమత్తంగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>