కలం, వెబ్‌డెస్క్: ఏజీ మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ శ్రీకాకుళం జైలుకు చేరుకోవడం ఆలస్యం కావడంతో సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో జగన్ అప్పలరాజును కలవకుండానే వెనుదిరిగారు. అయితే జగన్ పర్యటనలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, జగన్ కావాలనే జైలుకు ఆలస్యంగా వెళ్లారని అనిత అన్నారు. తమ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఉంటే జగన్ పర్యటనకు వెళ్లేవారా? అని ప్రశ్నించారు. పోలీసులు కేవలం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సహకరించారని చెప్పారు. అయినా జగన్ ప్రత్యేక ఎజెండాతోనే శ్రీకాకుళం వెళ్లారని, అప్పలరాజును అందుకే కలవలేదని వ్యాఖ్యానించారు.
జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో ఓ మహిళా ఎస్సైతో వైసీపీ నేతల ప్రవర్తన పట్ల అనిత మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్న అధికారిణితో అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

