కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) అసాంఘీక కార్యకలాపాలకు వేదికైంది. ఆస్పత్రి గదుల్లో మద్యం బాటిళ్లు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం ఆస్పత్రి మొదటి అంతస్తులో బీర్ బాటిళ్లు కనిపించాయి. దీంతో సందర్శకులు, రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బందికి తెలియకుండానే ఆస్పత్రిలోకి (Osmania Hospital) మద్యం బాటిళ్లు వచ్చాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక సిబ్బంది హస్తం కూడా ఉండి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పరిశీలించాలని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు!
-ఆస్పత్రి వార్డుల్లో దర్శనమిచ్చిన మందు బాటిళ్లు!
-రోగులు.. వారి బంధువులు తీవ్ర ఆగ్రహం
-బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న ప్రజలు
Discovery of Beer Bottles at Osmania Hospital Raises Safety Concerns and Demands for Action… pic.twitter.com/Ib2wMFsAEy— Kalam Daily (@kalamtelugu) July 30, 2026
Read Also: డ్రైవర్ ఇంట్లో కోట్లాది డబ్బు.. కౌంటింగ్ మిషన్లు కూడా ఫెయిల్!
Follow Us On : WhatsApp

