కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ (Vemulawada) శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గురువారం వరుణ యాగం (Varuna Yagam) చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి, మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్‌కు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఆలయంలోకి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి గితే కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.

