కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయం (Swarna Reservoir) లోకి వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గురువారం ఉదయం నాటికి జలాశయంలోకి 9,583 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1,175.5 అడుగులకు చేరిందని వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో జలాశయంలోకి మరింత వరదనీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

